September 15, 2026
Explore
దుకాణంలో ఓ యువతి బంగారు హారం కొట్టేసి… క్షణాల్లో మాయమైంది.

దుకాణంలో ఓ యువతి బంగారు హారం కొట్టేసి… క్షణాల్లో మాయమైంది.

September 15, 2026 | Uncategorized

అమరావతిముచ్చట్లు:

45 ఏళ్ల క్రితం… ఉజ్జయినిలోని ఓ చిన్న స్వర్ణకారుడి

పోలీసులు ఎంత వెతికినా ఆచూకీ లేదు.ఆమె ఎవరు? ఎక్కడికి వెళ్లింది? ఎలా అదృశ్యమైంది? సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

కాలం గడిచిపోయింది.ఆ యువతి తన పేరును మార్చుకుంది… తన గతాన్ని పాతిపెట్టింది…
45 ఏళ్ల పాటు ఎవరికీ అనుమానం రాకుండా మరో వ్యక్తిలా జీవించింది.

అంతా ముగిసిపోయిందని ఆమె అనుకుంది.కానీ… 2026లో ఒక AI ఫొటో ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది.

80ల నాటి ట్రెండ్‌లో తనను తాను చూపించుకోవాలనే సరదాతో…AIతో ఓ పాతకాలపు ఫొటోను తయారు చేయించుకుంది.ఆ ఫొటోను జ్ఞాపకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలైంది.ఆ ఫొటో ఎవరో ఒకరి కంటపడింది కాదు…

45 ఏళ్ల క్రితం ఆ బంగారు హారం దొంగిలించబడిన దుకాణం యజమాని కంటపడింది.

45 ఏళ్ల క్రితం తన దుకాణంలో కనిపించిన ఆ యువతి ముఖం…కాలం మార్చినా, పేరు మార్చినా…
ఆ ఫొటోలో మాత్రం మళ్లీ అతని ముందుకొచ్చింది.

పోలీసులు రంగంలోకి దిగారు.విచారణ మొదలైంది.
45 ఏళ్లుగా మూసుకుపోయిన ఆ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

చివరకు…45 ఏళ్ల క్రితం జరిగిన ఆ దొంగతనాన్ని ఆమె ఒప్పుకుంది.

ఎవరికీ తెలియకుండా దాచుకున్న గతాన్ని…
ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పెట్టుకున్న ఒక్క ఫొటో బయటపెట్టింది.

కాలం కొన్ని రహస్యాలను మరచిపోతుంది…
కానీ ఆధారాలను ఎప్పటికీ చంపదు.

45 ఏళ్ల క్రితం దాచుకున్న ముఖం…
2026లో AI సృష్టించిన ఓ ఫొటోలో తిరిగి కనిపించింది.

80ల జ్ఞాపకాల్లోకి ఒక్కసారి తిరిగి వెళ్లాలనుకున్న ఆమెకు…ఆ ప్రయాణమే 45 ఏళ్ల రహస్యానికి ముగింపు పలికింది.

Tags: A young woman stole a gold necklace from the shop and vanished in seconds.