తిరుమల ముచ్చట్లు:
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరుమలలోని శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవమూర్తులకు, స్నపన తిరుమంజనం నిర్వహించారు.శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తులకు కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం జరిగింది.తిరుమల శ్రీ పెద్ద జీయర్ స్వామి, టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags: Snapana ceremony performed for the processional deities of Sri Sita, Lakshmana, Anjaneya, and Sri Ramachandra at the Srivari Temple in Tirumala.