September 15, 2026
Explore
బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు

బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు

September 15, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని భీమగానిపల్లె మలుపు వద్ద ఆర్టీసి బస్సు ఢీకొని చంద్రశేఖర్‌ (45) తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం జరిగింది. గుట్టపల్లెకి చెందిన చంద్రశేఖర్‌ పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై పుంగనూరుకు వస్తుండగా చిత్తూరు వెళ్తున్న ఆర్టీసి బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌కు కాలు విరిగిపోయింది. స్థానికులు గమనించి బాధితున్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Man injured after being hit by a bus