పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని బండ్లపల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మండల పూజలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. శ్రీ చౌడేశ్వరిదేవి కవచదారణను అమ్మవారికి చేసి, పూజలు చేశారు. రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు అగిస్తిరెడ్డి, సుబ్బిరెడ్డి, నాగరాజారెడ్డి, కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.
Tags: Mandala Pujas for Sri Boyakonda Gangamma