September 15, 2026
Explore
వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు

వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు

September 15, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు 10 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం ప్రారంభమైన ఉత్సవాలలో వైభవంగా సాంస్కతిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని తేరువీధి, బజారువీధి, కుమ్మరవీధి, కట్టక్రిందపాళెం, నాగపాళెం, కోనేటిపాళెం, తూర్పు మొగశాల, నగిరివీధి, ఎంబిటి రోడ్డు, బస్టాండు , గోకుల్‌సర్కిల్‌ , మేలుపట్ల , బాలాజి థియేటర్‌, ఎన్‌ఎస్‌.పేట , దూళ్ళవాళ్లఇండ్లు, మల్లారమ్మగుడివీధి, భగత్‌సింగ్‌కాలనీ, కొత్తయిండ్లు, ప్రాంతాలతో పాటు సుమారు 213 చోట్ల వినాయకుడి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పందిరిలు వేసి, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఉదయం, రాత్రి అన్నదాన కార్యక్రమాలు, సాంస్కతిక కార్యక్రమాలు , భక్తిపాటలతో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి , సీఐ సుబ్బరాయుడు,ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండ జాగ్రత్తలు చేపట్టారు.

Tags: Vinayaka Chavithi celebrations held on a grand scale.