September 13, 2026
Explore
పల్నాడు జిల్లా లో వేరు వేరు గ్రామాల్లో ఇద్దరు మృతి

పల్నాడు జిల్లా లో వేరు వేరు గ్రామాల్లో ఇద్దరు మృతి

September 13, 2026 | Andhra Pradesh

నిన్న రాత్రి ఉరుములు ,పిడుగులు కురిసిన వర్షానికి పిడుగుల శబ్ద భయానికి…ఆగిన గుండెలు.

పల్నాడు ముచ్చట్లు:

పల్నాడు జిల్లాలో పిడుగుల ధాటికి ఇద్దరు వృద్ధ మహిళలు మృతి చెందిన విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. నరసరావుపేట మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఈ దుర్ఘటనలు జరిగాయి.

వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన తల్లపనేని నాగమ్మ (63) పిడుగుపాటుకు సంభవించిన భారీ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ వెంటనే ఆమె గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు.

అలాగే సమీపంలోని లక్ష్మీపురం గ్రామంలో మేకల వెంకాయమ్మ (60) కూడా పిడుగుల గర్జనకు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో ఆమెకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. పిడుగుల ధాటికి వెలువడిన భారీ శబ్దాల కారణంగానే తమ వారు మరణించారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags: Two people died in separate villages in Palnadu district.