పుంగనూరుముచ్చట్లు:
వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరు భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిలు ఆకాంక్షించారు. ఆదివారం వారు వేరువేరు ప్రకటనలలో ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ విఘ్నేశ్వరున్ని ప్రతి ఒక్కరు భక్తి శ్రద్దలతో పూజించి తాము జరిపే పనుల్లో విఘ్నాలు లేకుండ చూడాలని , కష్టాలు తొలగిపోయి, పంటలు పండి సుభిక్షంగా ఉండేలా ప్రార్థించాలని కోరారు.
Tags: Peddireddy and Mithun extend Chavithi greetings.