-పందిరిలు ఏర్పాటు
- వినాయక ప్రతిమలు, పూజాసామాగ్రీ విక్రయాలు
పుంగనూరుముచ్చట్లు:
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వాడవాడల వినాయక చవితి ఉత్సవాలకు ప్రజలు సిద్ధం చేస్తున్నారు. సోమవారం జరిగే పండుగ సందర్భంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణంలో ఆదివారం గణేష్ ఉత్సవ ఏర్పాట్లు చేపట్టారు. పట్టణంలోని తేరువీధి, బజారువీధి, కుమ్మరవీధి, కట్టక్రిందపాళెం, తూర్పు మొగశాల, ఎంబిటి రోడ్డు, బస్టాండు , గోకుల్‌సర్కిల్ , మేలుపట్ల , బాలాజి థియేటర్, ఎన్‌ఎస్.పేట , మల్లారమ్మగుడివీధి, భగత్‌సింగ్‌కాలనీ, కొత్తయిండ్లు, ప్రాంతాలతో పాటు సుమారు 213 చోట్ల వినాయకుడి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పందిరిలు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. పట్టణంలో పండుగ సంత వైభవంగా జరిగింది. పూజకు అవసరమైన మట్టి వినాయకుడి ప్రతిమలు, ఆరటి, చెరకు, మామిడి, వెలగ, జామ , దానిమ్మ, జిల్లేడు, బిల్వపత్రి , గరిక ,ఆకులు , చాటలు, పుటికలు, వెలగపండ్లు విక్రయాలు జోరుగా సాగాయి. వినాయకుడికి ప్రీతికరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలతో పట్టణం క్రిక్కిరిసింది. 10 రోజుల పాటు చవితి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి , సీఐ సుబ్బరాయుడు,ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణ ఆధ్వర్యంలో వినాయక చవితి ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టారు. దీనిపై ముందుగా ఉత్సవ కమిటిలకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి అమలు చేయాలని ఆదేశించారు.






Tags: Vinayaka Chavithi arrangements across every street and neighborhood.