September 13, 2026
Explore
ఏపీలోని అన్ని మండల ప్రజా పరిషత్ లలో ఓటర్ల జాబితాలు అందుబాటు

ఏపీలోని అన్ని మండల ప్రజా పరిషత్ లలో ఓటర్ల జాబితాలు అందుబాటు

September 13, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీలో శుక్రవారం నుంచి అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచినట్లు రాష్ట్ర ఎన్నికలసంఘం వెల్లడించింది. ప్రజల పరిశీలన కోసం ఈ ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తున్నామని తెలిపింది.మండలస్థాయిలో ఓటర్ల జాబితా ఆయా ఎంపీపీ కార్యాలయాల్లో, జిల్లాస్థాయి ఓటర్ల జాబితా ఆయా జడ్పీ సీఈవో కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అన్ని పంచాయతీ కార్యాలయాల్లోనూ ఈమేరకు సమాచారం అందుబాటులో ఉందని SEC అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.

Tags: Voter lists available at all Mandal Praja Parishads in AP.