- తిరుమల ముచ్చట్లు:
- రాష్ట్రాల మధ్య సమన్వయంతో కేసు పరిష్కారం.
- కర్ణాటక రాష్ట్రం, యాదగిరి జిల్లా, బిరనకల్ల తండాకు చెందిన కార్తీక్ (16 సంవత్సరాలు), S/o తాపా రాథోడ్ అనే బాలుడిని తిరుమల పోలీసులు తిరుమల పరిధిలో ఫోటో ఆధారంగా గుర్తించారు.
- సదరు బాలుడు 9వ తరగతి చదువుచుండగా, తల్లిదండ్రులు మందలించిన కారణంగా 20.03.2026 న ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ విషయమై 23.03.2026 న యాదగిరి మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కూడా చేశారు.
- దర్యాప్తులో భాగంగా యాదగిరి పోలీసుల నుండి అందిన సమాచారం మేరకు తిరుమల II టౌన్ పోలీసులు వెంటనే స్పందించి తిరుమల పరిధిలో బాలుడిని గుర్తించారు. అనంతరం బాలుడిని మంగళం లోని ప్రభుత్వ బాలుర గృహానికి (Govt. Boys Home) భద్రతార్థం అప్పగించారు. తదుపరి చర్యల కోసం కర్ణాటక పోలీసులకు సమాచారం అందించారు.
- ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, మాట్లాడుతూ తిరుమల వంటి ప్రాధాన్యత గల క్షేత్రంలో ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు రాకపోకలు జరుగుతుంది. తప్పిపోయిన వారు మరియు ఇంటి నుండి అలిగి వచ్చిన వారిని. గుర్తించడం పోలీసులకు ఒక సవాల్ అయినప్పటికీ, తిరుమల పోలీసు సిబ్బంది అంకితభావంతో, సమన్వయంతో పని చేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు అని అన్నారు.
- అలాగే 24×7 కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అప్రమత్తత, టిటిడి విజిలెన్స్ విభాగం సహకారం, మరియు పోలీసు సిబ్బంది తక్షణ స్పందన వల్ల ఇటువంటి కేసులను త్వరితగతిన ఛేదించగలుగుతున్నాముఈ విధమైన సమర్థ వంతమైన పోలీసింగ్ ప్రజల్లో పోలీసు వ్యవస్థపై మరింత భరోసా కల్పించేలా ఉందని అన్నారు.
- అదేవిధంగా, తిరుపతి జిల్లా /తిరుమల పోలీసులు ఇలాంటి కేసుల్లో ఇతర జిల్లాలు మరియు ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ, సరైన సమయంలో సమాచారాన్ని పంచుకుంటూ పని చేస్తున్నారు. ఈ సమన్వయం ద్వారా ప్రజల విశ్వాసం మరింత పెరుగుతోంది. ఇది అభినందనీయం” అని తెలిపారు.
- ఈ సందర్భంగా తిరుమలలో సేవలందిస్తున్న ఉన్నతాధికారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే తిరుమల II టౌన్ పోలీసుల వేగవంతమైన చర్యలను మరియు యాదగిరి పోలీసులతో సమన్వయాన్ని ఆయన ప్రశంసించారు.
Tags:Missing boy identified in Tirumala.