September 12, 2026
Explore
వినాయక మండపాలకు ముందస్తు అనుమతులు పొందాలి

వినాయక మండపాలకు ముందస్తు అనుమతులు పొందాలి

September 12, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా పుంగనూరు అర్బన్‌ సీఐ సుబ్బరాయుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని తెలిపారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా, ప్రజలకు అసౌకర్యం కలిగేలా ప్రవర్తించరాదన్నారు. పట్టణంలో శాంతిభద్రతల దృష్ట్యా 11 రోజుల్లోనే వినాయక నిమజ్జనాలను పూర్తి చేయాలని సూచించారు. నిమజ్జనం కోసం న్యూటన్‌ సమీపంలోని మరియు పుంగమ్మ చెరువులో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Tags: Prior permission must be obtained for Vinayaka pandals.