September 12, 2026
Explore
పోస్టుల భర్తీపై అభ్యంతరాలు 15లోపు తెలపాలి

పోస్టుల భర్తీపై అభ్యంతరాలు 15లోపు తెలపాలి

September 12, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా APC డా. నున్నా అనూరాధ

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBVs) ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థుల తుది మెరిట్‌ జాబితాను అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ అనూరాధ తెలిపారు.

అభ్యర్థులు తుది మెరిట్‌ జాబితాను “www.annamayyasamagra.online” వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలని ఆమె సూచించారు. తమ వివరాల్లో ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే తగిన ఆధారాలతో ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు మదనపల్లె ZPHS ప్రాంగణంలోని జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో లిఖితపూర్వకంగా సమర్పించాలని కోరారు.

నిర్దేశిత గడువు అనంతరం అందే అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలనకు స్వీకరించబోమని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 7989974663, 8688618382 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

Tags: Objections regarding the filling of posts must be submitted by the 15th.