September 12, 2026
Explore
93 కేసుల అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్..!!

93 కేసుల అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్..!!

September 12, 2026 | Andhra Pradesh


👉..ఏపీ,తెలంగాణలో 93 కేసులు..నంద్యాల పోలీసులకు చిక్కిన నిందితుడు..!!
👉..సాంకేతిక ఆధారాలతో పట్టివేత..స్కూటీ స్వాధీనం..!!
👉..మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత రామనాథన్..!!

నంద్యాల ముచ్చట్లు:


..ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన అంతర్రాష్ట్ర దొంగ ఎట్టకేలకు నంద్యాల పోలీసులకు చిక్కాడు.రెండు రాష్ట్రాల్లో కలిపి 93 కేసులు ఉన్న నిందితుడిని నంద్యాల మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.సాంకేతిక ఆధారాలతో నిందితుడి ఆచూకీని పసిగట్టి అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ శుక్రవారం మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు..!!

..ఏఎస్పీ తెలిపిన వివరాల మేరకు..నంద్యాల పట్టణంలోని మహానంది కాలనీ రైల్వే క్వార్టర్స్‌లో గత ఆగస్టు 20న ఇంటి దొంగతనం జరిగింది.దుండగుడు ఇంట్లోకి చొరబడి ఐఫోన్-11,టామీ హిల్‌ఫిగర్ వాచ్‌తో పాటు AP 04 AN 0518 నంబరు గల TVS పెప్ స్కూటీని అపహరించాడు.చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు రూ.67 వేలు ఉంటుందని పోలీసులు గుర్తించారు..!!

..కేసు నమోదు చేసిన మూడో పట్టణ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.నిందితుడి కదలికలపై సాంకేతిక ఆధారాలతో నిఘా పెట్టారు.ఆధారాలను విశ్లేషిస్తూ నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు సెప్టెంబర్ 11న నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.అతడి నుంచి చోరీకి గురైన TVS పెప్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.దీని విలువ సుమారు రూ.35 వేలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు..!!

..నిందితుడిని విచారించడంతో అతడి నేర చరిత్ర బయటపడింది.ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 93 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.కర్నూలు,కడప,ఏలూరు, అనంతపురం తదితర జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ ఇతడిపై కేసులు నమోదైనట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వెల్లడించారు..!!

..చోరీలను వృత్తిగా మార్చుకున్న నిందితుడు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.నంద్యాలలో జరిగిన చోరీ కేసు దర్యాప్తు సందర్భంగా అతడి పాత నేర చరిత్ర మొత్తం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడికి సంబంధించిన మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది..!!

..కేసు ఛేదనలో నంద్యాల మూడో పట్టణ సీఐ వేణుగోపాల్,పోలీసు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారని ఏఎస్పీ తెలిపారు.సిబ్బంది పనితీరును జిల్లా ఎస్పీ సునీల్ షరాన్ అభినందించినట్లు ఆమె వెల్లడించారు..

Tags: Interstate thief involved in 93 cases arrested!