September 12, 2026
Explore
వినాయక చవితి వేడుకలకు పోలీసుల నిబంధనలు తప్పనిసరి:DSP

వినాయక చవితి వేడుకలకు పోలీసుల నిబంధనలు తప్పనిసరి:DSP

September 12, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో వినాయక మండపాల కమిటీ నిర్వాహకులతో డీఎస్పీ కృష్ణమోహన్ సమావేశం నిర్వహించారు. వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, భక్తి, ఆనందం, సామరస్యంతో నిర్వహించాలని సూచించారు.
విగ్రహం ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు కమిటీ నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. డీజేలకు పోలీసుల అనుమతి తీసుకోవాలని, అసభ్యకర కార్యక్రమాలకు తావివ్వకూడదని సూచించారు.

నిమజ్జనం వివరాలను ముందుగా పోలీసులకు అందజేయాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కృష్ణమోహన్ కోరారు.

Tags: Police guidelines mandatory for Vinayaka Chavithi celebrations: DSP