September 12, 2026
Explore
అన్న క్యాంటీన్‌లో ఆకస్మిక తనిఖీ చేసిన మౌర్య రెడ్డి

అన్న క్యాంటీన్‌లో ఆకస్మిక తనిఖీ చేసిన మౌర్య రెడ్డి

September 12, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను టీడీపీ యువ నాయకుడు మౌర్య రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ₹5కే భోజనం అందిస్తున్న క్యాంటీన్‌ సేవలను పరిశీలించారు. ఆహారం నాణ్యత, రుచి, పరిశుభ్రతతో పాటు ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేశారు.

భోజనం చేస్తున్న పేద ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజలకు అందుతున్న భోజనం నాణ్యతపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేదలపై భారం పడకుండా అన్న క్యాంటీన్‌ సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. పేదలకు నాణ్యమైన భోజనం అందేలా క్యాంటీన్‌ సేవలను నిరంతరం పర్యవేక్షిస్తామని మౌర్య రెడ్డి పేర్కొన్నారు.

Tags: Maurya Reddy conducted a surprise inspection at the Anna Canteen.