September 12, 2026
Explore
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాలకు గుర్తింపు కార్డుల పంపిణీ

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాలకు గుర్తింపు కార్డుల పంపిణీ

September 12, 2026 | Andhra Pradesh

వీరబల్లి ముచ్చట్లు:

YSRCP బలోపేతానికి అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీపీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలివీటి రాజేంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

వీరబల్లి మండల కేంద్రంలో వివిధ అనుబంధ విభాగాల సభ్యులకు పార్టీ అధికారిక గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అనుబంధ విభాగాల పాత్ర కీలకమని, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గుర్తింపు కార్డులు పొందిన సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని కోరారు.

Tags: Distribution of identity cards to YSRCP affiliated wings.