పుంగనూరుముచ్చట్లు:
కార్పెంటర్లుకు వినాయక చవితి పండుగ తరువాత నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇవ్వనున్నట్లు కార్మికశాఖ ఎన్‌ఏసీ ట్రైనర్ మునెప్ప తెలిపారు. శుక్రవారం స్థానిక భవన నిర్మాణ కార్మికులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పెంటర్ల శిక్షణకు ఆన్‌లైన్ ధరఖాస్తు పక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. ఒక బ్యాచ్‌కు 30 మంది చొప్పున 15 రోజుల పాటు వారికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ తరువాత గుర్తింపు సర్టిఫికెట్లు అందిస్తామన్నారు.
Tags:Application process for carpenter training begins.