September 11, 2026
Explore
పెన్షన్‌ ధరఖాస్తుల గడువు పొడిగించాలి

పెన్షన్‌ ధరఖాస్తుల గడువు పొడిగించాలి

September 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పెన్షన్ల ధరఖాస్తు నమోదుకు ప్రభుత్వం విధించిన గడువును పొడిగించాలని మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌ఆర్‌.అశోక్‌ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 16 వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారని తెలిపారు. వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో అర్హులైన లబ్ధిదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని , దీనిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని గడువును మరికొన్ని రోజులు పొడిగించి అర్హత కలగిన వారందరికి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు, నాగరాజ, పరమేష్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: The deadline for pension applications should be extended.