పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఒప్పంద కార్మికులను క్రమబద్దీకరించాలని కోరుతూ ఏరియా ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. శుక్రవారం ఏరియా ఆసుపత్రి ఆవరణంలో ఒప్పంద కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సీఎంకు పోస్ట్కార్డులు పంపుతున్నట్లు స్థానిక సంఘ నాయకులు తెలిపారు. వందశాతం స్థూలజీతం చెల్లించాలని, పరస్పర లేదా అభ్యర్థన బదిలీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
Tags: Innovative protest by contract workers