మొయినాబాద్ ముచ్చట్లు:
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు కోర్టు ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించింది.
నేటితో కస్టడీ ముగియడంతో నిందితులను సిట్ అధికారులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మరో ఐదు రోజులు వారిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు.
కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని నిందితుల తరుపు లాయర్లు తెలిపారు. ఈ మేరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. అనంతరం ముగ్గురు నిందితులను జైలుకి తరలించారు.
Tags: Farmhouse Drugs Case: Remand Extended for Three Accused