ఆదిలాబాద్ ముచ్చట్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి అధికారులకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సింహస్వప్నంగా మారింది. తాజాగా మామడ ఎస్సై అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో జిల్లాలో కలకలం రేగింది. గతంలో కూడా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో రెవెన్యూ, విద్యుత్ శాఖాధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ప్రజలు చైతన్యంతో 1064 నెంబర్‌కు ఫిర్యాదు చేసి అవినీతి అధికారులపై చర్యలు తీసుకునేలా ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.
Tags; Ask for a Bribe, and the Lock-up Awaits!