September 9, 2026
Explore
డ్రోన్ కెమెరాలకు చిక్కిన కోడిపందెగాళ్లు.. 11 మందికి 10 రోజుల జైలు

డ్రోన్ కెమెరాలకు చిక్కిన కోడిపందెగాళ్లు.. 11 మందికి 10 రోజుల జైలు

September 9, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ బోగిటివారిపల్లెలో అక్రమంగా కోడిపందేలు నిర్వహిస్తున్న 11 మందిని డ్రోన్ కెమెరాల సాయంతో పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.ఏపీ గేమింగ్ యాక్ట్-1974 కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, నేరం రుజువు కావడంతో 11 మందికి 10 రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతికతను వినియోగించి నిందితులను పట్టుకుని పకడ్బందీగా ఆధారాలు సేకరించిన మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ, ఎస్‌ఐలు విష్ణు నారాయణ, రామకృష్ణారెడ్డి, డ్రోన్ సర్వేలెన్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజ్ అభినందించారు.

Tags: Cockfighting gamblers caught on drone cameras; 11 sentenced to 10 days in jail.