అమరావతిముచ్చట్లు:
ఏపీలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ద్వారా పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. గుర్తించిన మార్కెట్ యార్డులు, జాయింట్ కలెక్టర్లు నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లోనే కొనుగోళ్లు జరుపుతారు. రైతులు తప్పనిసరిగా ‘కపాస్ కిసాన్’ యాప్ లో స్లాట్ బుక్ చేసుకుని, లూజుగా ఉన్న పత్తినే కేంద్రాలకు తీసుకురావాల్సి ఉంటుంది. ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోకే నేరుగా డబ్బులు జమ చేస్తారు.
Tags: Cotton procurement in AP only through slot booking: Government