అమరావతి ముచ్చట్లు:
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ప్రజలు, మండపాల నిర్వాహకులకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా, రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు కూడా ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రజలందరినీ ఆ గణేశుడు విజయాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.
Tags: Free electricity for Ganesh Mandapams in AP