చెక్కులు తీసుకున్న వైనం
పుంగనూరుముచ్చట్లు:
ఉద్యోగం ఇస్తామంటు ఒక మహిళ మరో మహిళను మోసగించి రూ.10 లక్షల నగదు, రూ.45 లక్షల రూపాయల చెక్కులు తీసుకుని మోసం చేసిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వనమలదిన్నెకి చెందిన లావణ్య అనే మహిళ గత ఏడాది ఆనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆ సమయంలో పట్టణానికి చెందిన హేమప్రభ ఆ సమయంలో ఆసుపత్రిలో లావణ్యకు పరిచయమైంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న లావణ్యకు ఉద్యోగం ఇప్పిస్తామని హేమప్రభ నమ్మించి ఫోన్ ఫే ద్వారా సుమారు రూ.10 లక్షలు నగదు తీసుకుంది. అలాగే హేమప్రభ భర్త అశోక్ సిబిఐ అధికారి అని నమ్మబలికి మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటు భార్యభర్తలు ఇద్దరు రూ.45 లక్షల రూపాయల చెక్కులను లావణ్య వద్ద తీసుకుని ఉద్యోగం ఇవ్వకుండ, చెక్కులు ఇవ్వకుండ మోసగించారు. లావణ్య నిలధీయ్యడంతో హేమప్రభ, అశోక్ కలసి లావణ్య రూ.45 లక్షలు బకాయిలు ఉందని, అందుకు చెక్కులు ఇచ్చిందని, తక్షణమే బకాయిలు చెల్లించాలని లీగల్ నోటీసులు పంపడంతో లావణ్య లబోదిబో మంటు పోలీసులను ఆశ్రయించింది. సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
Tags: Rs 10 Lakhs Swindled with Promise of a Job