మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె డివిజన్‌లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులకు మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సీడీపీవోలు నాగవేణి, సుజాత, భాగ్యమ్మ తెలిపారు. మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సబ్‌కలెక్టర్ చల్లా కల్యాణి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 7 అంగన్‌వాడీ వర్కర్లు, 77 ఆయా పోస్టులకు మొత్తం 115 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకురావాలని సీడీపీవోలు నాగవేణి, సుజాత, భాగ్యమ్మ సూచించారు.
Tags: Interviews for Anganwadi posts today.