September 8, 2026
Explore
10న సైట్ ఇంజనీర్ల దరఖాస్తుల పరిశీలన

10న సైట్ ఇంజనీర్ల దరఖాస్తుల పరిశీలన

September 8, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె సమగ్రశిక్షలో సైట్ ఇంజనీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 10న నిర్వహించనున్నట్లు ఏపీసీ అనూరాధ తెలిపారు. 4 సైట్ ఇంజనీర్, 3 డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులకు 53 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరిపాలనా కారణాలతో ఐదుగురు ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇప్పటికే నియమించగా, మిగిలిన రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో 10న ఉదయం 10 గంటలకు సమగ్రశిక్ష కార్యాలయంలో హాజరుకావాలని అధికారులు సూచించారు.

Tags: Scrutiny of site engineer applications on the 10th.