తంబళ్లపల్లి ముచ్చట్లు:
ఆశా వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ తంబళ్లపల్లి నియోజకవర్గ కార్యదర్శి సలీం భాషా డిమాండ్ చేశారు.మంగళవారం పిటియం విహెచ్సీలో ఆశా వర్కర్లను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేసి, ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని కోరారు. డ్యూటీలో మరణించిన ఆశా వర్కర్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల శ్రమకు తగిన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని సలీం భాషా ప్రభుత్వాన్ని కోరారు.
Tags: The issues faced by ASHA workers must be resolved immediately.