సంబేపల్లి ముచ్చట్లు:
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని ఉప విద్యాశాఖాధికారి నాగయ్య అన్నారు. సంబేపల్లి మండలం మోటకట్ల హైస్కూల్‌లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన యండపల్లి నాగ శేషారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఉత్తమ సేవలు, అంకితభావం, నిబద్ధతతో పనిచేసినప్పుడే సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని నాగయ్య పేర్కొన్నారు. మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరాజు సూచించారు. అనంతరం నాగ శేషారెడ్డిని ఉపాధ్యాయులు, సిబ్బంది శాలువాలతో సత్కరించి అభినందించారు.
Tags:The teaching profession is extremely sacred: Nagayya