ఆ గడ్డిపరకతో గడ్డి తిని మనుగడ సాగించేనా?
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన బిగ్ టీవీ మీడియా సంస్థ, దక్షిణాదిలో తన నెట్‌వర్క్‌ను విస్తరించే క్రమంలో క్రమంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అనివార్యంగా చేసిన మోసాలు వీధిన పడ్డాయి. తెల్ల ఏనుగు లెక్కన మారుతున్న సంస్థ నడపలేక, ఉద్యోగుల పొట్ట కొడుతూ, చివరికి రాజకీయ అక్రమ డీల్స్ శరణు కోరిన తీరు మీడియా రంగానికే పెద్ద మచ్చగా మారింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ బ్యూరోలతో అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ టీవీ, కొద్ది నెలల్లోనే తీవ్ర ఆర్థిక లోతుల్లోకి కూరుకుపోయింది. ప్రకటనల ఆదాయం లేక, కేబుల్ క్యారేజీ ఛార్జీలు చెల్లించలేక ప్రసారాలు నిలిచిపోయే స్థితికి చేరింది. కేరళలో BIGTV 24×7 Malayalam News పేరుతో ప్రవేశించి, అక్కడ ఫ్రాంచైజీలు, ఏజెన్సీ హక్కులు కేటాయిస్తామని చెప్పి ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు వసూలు చేసింది. అయితే, అక్కడ కూడా జీతాలు ఇవ్వకపోవడం, ఇన్వెస్టర్లను మోసం చేయడంతో ఎర్నాకుళం, తిరువనంతపురంలలో ఎఫ్‌ఐఆర్‌లు (IPC 420, 406, 120B) నమోదయ్యాయి. కార్మిక శాఖ నోటీసులు, పోలీసు కేసుల సుడిగుండంలో కేరళ విభాగం కూరుకుపోయింది.
తన మెడికల్ చైన్‌లో కొన్ని అమ్మి పెట్టుబడులు పెడుతున్నా ఆర్థికంగా కోలుకోలేకపోతున్న బిగ్ టీవీ సంస్థను కాపాడుకోవడానికి చైర్మన్ వెన్నం విజయ్‌కాంత్ రెడ్డి రాజకీయాశ్రయాన్ని వెతుక్కున్నారు. గచ్చిబౌలిలోని స్టార్ హోటళ్లు అడ్డాగా వైసీపీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, మార్గాని భరత్, గడికోట శ్రీకాంత్ రెడ్డిలతో రహస్యంగా సమావేశమయ్యారనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ అగ్రనేత జగన్ మోహన్ రెడ్డితో భేటీకి అపాయింట్‌మెంట్ ఖరారు చేసుకునే స్థాయికి ఈ బేరసారాలు వెళ్లడం, సజ్జల రామకృష్ణారెడ్డి భరోసాతో ఉద్యోగుల నెలవారీ జీతాల నిధులు పొందేందుకు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక ఉన్న చీకటి కోణం స్పష్టమవుతోంది.
వైసీపీ సోషల్ మీడియా మరియు పార్టీ కార్యాలయం నుండి పూడి శ్రీహరి పంపే నిరాధార స్క్రిప్టుల ఆధారంగా డీఎస్సీ (DSC) నియామకాలపై తప్పుడు కథనాలు ప్రసారం చేయడం పత్రికా విలువలకే గొడ్డలిపెట్టు. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశాన్ని అడ్డం పెట్టుకుని, రాజకీయ కుట్రలో భాగస్వామి కావడం అత్యంత హేయమైన చర్య. న్యూస్ రూమ్‌లో ఎడిట్ చేసిన వీడియోలను పొలిటికల్ సోషల్ మీడియా విభాగానికి చేరవేస్తూ ‘వైకాపా అజెండా జర్నలిజం’ నడుపుతున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి. అందుకోసం ఏకంగా సాక్షిలో పనిచేసే సర్తాజ్‌ను బిగ్ టీవీలోకి పంపి పావుగా మార్చారు
మరోవైపు, కడుపు కట్టుకుని పనిచేస్తున్న ఉద్యోగులకు గత ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్న యాజమాన్యం, గత మూడున్నరేళ్లుగా వారి జీతాల నుంచి కట్ చేసిన పీఎఫ్ (PF) సొమ్మును ప్రభుత్వానికి జమ చేయకుండా సొంతానికి వాడుకోవడం తీవ్రమైన ఆర్థిక నేరం. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వంటి రాజకీయ నాయకుల లిక్కర్ స్కాము డబ్బులతో బలవంతంగా వాటాలు కొనుగోలు చేయించేందుకు తెరవెనుక లాబీయింగ్ చేస్తూనే, మరోవైపు ఉద్యోగులను వంచనకు గురిచేస్తున్నారు.
ఏ కేబుల్ నెట్‌వర్క్‌లోనూ రాక, ఏ డీటీహెచ్ ప్లాట్‌ఫామ్‌లోనూ కనిపించక, కేవలం ఒక యూట్యూబ్ లింక్‌కే పరిమితమైన ఒక ఛానెల్‌కి కోట్లాది రూపాయల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది మిస్టరీ వీడుతోంది. హైదరాబాద్‌లోని కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని సాగిస్తున్న ల్యాండ్ సెటిల్‌మెంట్లు, దందాల బండారం త్వరలోనే ఆధారాలతో సహా బట్టబయలు కాక తప్పదు. ఇప్పటికే అందులో జర్నలిస్టులుగా అక్రమ సంబంధాలను పెట్టుకుని భర్తను చంపేయాలనుకున్న రోగ్‌లను పెట్టుకుని, తిరిగి గ్రామం మీదే కేసులు పెట్టించే స్థాయికి చేరుకుంది.
అవన్నీ బయటకు వస్తుండడంతో పూర్తిగా సాక్షికి అనుబంధ బ్లూ మీడియాగా మారిపోయింది.
Tags: The “Big Blue Deal” before going under!