మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలో ప్రేమ పేరుతో మోసపోయామని ఆరోపిస్తూ మంగళవారం శేషమహల్ శారదానగర్ కు చెందిన దివ్య కుటుంబంతో కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. శేషమహల్ కు చెందిన పెంజూరి చలమయ్య కుమారులు రోహిత్, లోహిత్ సాయి తనను, చెల్లెలు గీతికను మోసం చేశారని, తమలాగానే ఇంకా మరో 50 మంది యువతులు బాధితులుగా ఉన్నారని ఆరోపించింది. న్యాయం జరగలేదని తండ్రి ప్రసాద్ రెడ్డి పెట్రోల్ తో పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం దివ్య ఇంటికి వెళ్లి విషం తాగి యత్నించగా ఆమెను స్థానిక ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది..
Tags: Deceived in the name of love: Father and child attempt suicide seeking justice.