అమరావతిముచ్చట్లు:
ఏపీ స్థానిక ఎన్నికలకు ఇంకా ప్రకటనే రాలేదు. అప్పుడే కేంద్ర బలగాలు పెట్టాలంటూ ఎస్ఈసీకి వైసీపీ వినతి పత్రం సమర్పించింది.
గొడవల్లేకుండా పులివెందుల జడ్పీటీసీకి ఎన్నికలు జరిగినా… అక్కడ ఏదో జరిగినట్లుగా ప్రచారం చేస్తూ ఈ విజ్ఞప్తి సమర్పించారు.
ఎన్నికల ప్రకటన వచ్చాక కేంద్ర బలగాల భద్రత లేదు కాబట్టి తాము ఎన్నికల బహిష్కరిస్తామని ప్రకటన చేయబోతున్నారా?
లోకల్ పోల్స్‌కు కేంద్ర బలగాల భద్రత కల్పించడం అసాధ్యం అని వైసీపీకి తెలియదా?.
జగన్ హయాంలో అత్యంత దారుణంగా ఎన్నికలు నిర్వహించినా కేంద్ర బలగాలు రాలేదని తెలియదా?
Tags: Is YSRCP planning a roadmap to boycott the elections?