September 7, 2026
Explore
ప్రజా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు జనసేన నేత వినతి

ప్రజా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు జనసేన నేత వినతి

September 7, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో పలు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ జనసేన పార్టీ సీనియర్ నేత రామా శ్రీనివాస్ వినతిపత్రాలు సమర్పించారు.
ఝరికోన ప్రాజెక్టు తూము నుంచి బహుదా నదిలోకి నీటిని విడుదల చేసి తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
రాయచోటి–సుండుపల్లి–రాజంపేట రహదారిలో సానిపాయి వరకు ఉన్న సింగిల్ రోడ్డు ప్రాంతాలను గుర్తించి, అటవీ శాఖ అనుమతులు అధికారికంగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండు వరుసల రహదారి నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యల్లో అధికారులు సహకరించి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రామా శ్రీనివాస్ కోరారు.

Tags: Janasena leader submits representation to Collector seeking resolution of public issues.