.ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్‌లో శుభకార్యాల వద్ద హిజ్రాల బలవంతపు వసూళ్లు మితిమీరుతున్నాయి. చింతల్ బస్తీకి చెందిన ఓ మహిళ తన గృహప్రవేశంలో కొందరు హిజ్రాలు చొరబడి రూ. 50 వేలు డిమాండ్ చేస్తూ వేధించారని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శుభకార్యాల వద్ద రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు దౌర్జన్యంగా వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. గతంలో హెచ్చరికలు ఇచ్చినా పరిస్థితి మారలేదని, ఈ బలవంతపు వసూళ్లపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
Tags: Hijras create a ruckus in Hyderabad over ₹50,000 at a housewarming ceremony.