మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా, మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లె టమాట మార్కెట్ యార్డ్ ఆనుకుని, కాపురం ఉండే కోనేటి సులోచనకు సంబందించిన ఇళ్ళల్లో పోలీసులు సోదాలు చేపట్టారు. కోర్టు ఉత్తర్వులతో డిఎస్పీ బుచ్చిరాజు ఆదేశాల మేరకు శనివారం ఉదయం పెద్ద ఎత్తున పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆమె ఇళ్లను చుట్టు ముట్టి ఏక కాలంలో సోదాలు చేపట్టారు. ఆమె ఇళ్లల్లో ఉన్నవారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. వ్యాపార కార్యకలాపాలు, ఇతరత్రాలపై పోలీసులు ఈ సోదాలు చేపట్టారు. మరిన్ని వివరాలను పోలీసులు అధికారికంగా వెళ్ళడించాల్సి ఉంది..
Tags: Police conduct extensive searches at Koneti Sulochana’s residences.