తూర్పుగోదావరి ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., ఆదేశాల మేరకు నేర నివారణాత్మక పోలీసింగ్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో “పల్లెనిద్ర(గ్రామ, వార్డు)”.
జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యలు.
పోలీసు–ప్రజల మధ్య నమ్మకం, సహకారం పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే నేరరహిత సమాజం సాధ్యమవుతుంది.
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు “పల్లెనిద్ర(గ్రామ, వార్డు)” చేసి ప్రజలతో మమేకమై వారి సమస్యలను, అక్కడి పరిస్థితులను గురించి తెలుసుకొని, నేరాల నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ/ వార్డు ప్రాంత ప్రజల భద్రత, అవగాహన, పోలీసు–ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, గ్రామాలు, వార్డులలో ఏవైనా సమస్యలు ఉంటే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకొని రావాలని, ఆ సమస్యల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలు , నూతన చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు.
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పూనుకుంటున్నటు వంటి వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మహిళా భద్రతా విధానాలు, సెల్ఫ్ డిఫెండింగ్ టెక్నిక్స్, సైబర్ నేరాలు, లోన్ యాప్‌లు, ట్రాఫిక్ నియమాలు, సోషల్ మీడియా మోసాలు, యాంటీ డ్రగ్స్, బాల్య వివాహాలు మరియు శక్తి యాప్‌ల డౌన్‌లోడ్‌ల గురించి అవగాహన కలిగించారు.
అదేవిధంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణ, ఆధారాల సేకరణలో కలిగే ప్రయోజనాలను వివరించారు.
గత రాత్రి కడియం పోలీస్ స్టేషన్ పరిధిలోని కడియపులంక గ్రామం, కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో, ఉండ్రాజవారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకపాడు గ్రామం నందు పల్లెనిద్ర(గ్రామ, వార్డు) కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
Tags: