అమరావతి ముచ్చట్లు:
ఏపీ 2026 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు ఈ అవార్డులను ఖరారు చేసింది. ఇందులో పాఠశాల విద్యాశాఖ నుంచి 79 మంది, ఇంటర్ బోర్డు నుంచి 24 మంది ఎంపికయ్యారు. పురస్కారాలకు ఎంపికైన టీచర్లు, హెచ్ఎంలు, లెక్చరర్ల పేర్లతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సిక్కోలు జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు అరుదైన గౌరవం
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యా యులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు. మెండ రామారావు, అల్లు అప్పన్న, యతిరాజుల హేమసుందర్ ఈ గౌరవాన్ని అందుకోనున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్య క్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వీరికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. దీంతో జిల్లాలో విద్యారంగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Tags: List of best teachers in AP released.