March 27, 2026
Explore
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కొత్తపేట కాఖిల వ్యవహారం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కొత్తపేట కాఖిల వ్యవహారం

March 27, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం చదును మహాలక్ష్మమ్మ గుడి వద్ద యువకులు బైక్ పై కూర్చుని ఉన్నారు అటుగా వెళుతున్న కొత్తపేట పోలీసులు ఆ కుర్రవాళ్ళని ఇక్కడ ఎందుకు బైకులు నిలిపి ఉన్నారని అడిగారు మా ఇల్లు పక్కనేనండీ వెళుతూ వెళుతూ ఫ్రెండ్ కనపడితే మాట్లాడే వెళుతున్నామని సమాధానం చెప్పారు, అంతటా వారు చెప్పిన సమాధానం నచ్చని కొత్తపేట కాఖీలు లాఠీతో ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇదేమిటైనీ యువకులు ప్రశ్నించగా మద్యం సేవించావని డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ చేసి వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించారు.డ్రంక్& డ్రైవ్ టెస్ట్లు మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని పోలీసులు ఆపి డ్రంక్& డ్రైవ్ టెస్ట్ చేసి జరిమానా విధిస్తారు లేదంటే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు కానీ ఇక్కడ అలా జరగలేదు.యువకులు ఆగి ఉన్న తర్వాత వారి వద్దకే వెళ్లి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి వారిని లాటితో కొట్టి వాహనాన్ని స్వాధీనం చేసుకున్న కొత్తపేట పోలీసుల తీరు వీధి రౌడీల్లాగా వారి ప్రవర్తన ఉంటుందని స్థానికులు మండిపడుతున్నారు.

Tags: The Kotapeta ‘Khaki’ Affair: Comes to Light Belatedly