September 4, 2026
Explore
ఉచిత గుండె వైద్య పరీక్ష శిబిరం

ఉచిత గుండె వైద్య పరీక్ష శిబిరం

September 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య పరీక్ష శిబిరం శుక్రవారం నిర్వహించారు. స్థానిక సరళ హోమియో ఆసుపత్రిలో జరిగిన శిబిరానికి 85 మంది జబ్బులు కలిగిన వారు హాజరైయ్యారు. ఆర్‌ఎల్‌ జాలప్ప నారాయణ హార్ట్ సెంటర్‌ వైద్యులు చికిత్సలు నిర్వహించారు. ఇందులో 18 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డైరెక్టర్‌ డాక్టర్‌ శివ, క్లబ్‌ అధ్యక్షులు మహేంద్రరావు, కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, కోశాధికారి సుధాకర్‌రావు, సభ్యులు వరదారెడ్డి, త్రిమూర్తిరెడ్డి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Free Cardiac Medical Check-up Camp