పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని మీర్జేపల్లె ఎలిమెంటరీ పాఠశాల ఉపాధ్యాయుడు కె.సుధాకర్‌ను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా శుక్రవారం ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2019లో మండల ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపికైయ్యారు. శనివారం జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ చేతులు మీదుగా ఆయన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును మదనపల్లెలో అందుకోనున్నారు. కాగా ఉపాధ్యాయుడుగా విశిష్ట సేవలు అందించినందుకు ఆయనను స్థానిక ఉపాధ్యాయులు, సంఘ నాయకులు కిషోర్‌కుమార్‌రెడ్డి, బుడ్డన్న తదితరులు కలసి అభినందించారు.
Tags: Sudhakar, the Best Teacher