పుంగనూరుముచ్చట్లు:
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఉత్సవాలు నిర్వహించే వారు పోలీసుల అనుమతి పొందాలని సీఐ సుబ్బరాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉత్సవాల కోసం ఏర్పాటు చేసే మండపాలు, నిర్వాహకుల వివరాలతో ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసి అనుమతి పొందాలన్నారు. వినాయకుడి ఏర్పాట్లతో పాటు నిమజ్జనం తేదీ వివరాలు కూడ ధరఖాస్తులో తెలపాలన్నారు. అనుమతి లేకుండ చవితి ఉత్సవాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Tags: Permission must be obtained for Vinayaka Chavithi celebrations.