September 4, 2026
Explore
అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ శాఖకు షాక్

అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ శాఖకు షాక్

September 4, 2026 | Andhra Pradesh

-35 ఏళ్ల BMP వింగ్ తొలగింపు
-మదనపల్లి జిల్లా కేంద్రానికే దెబ్బ
– ఉన్న పోస్టులను తిరుపతికి తరలింపు

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె జిల్లా కేంద్రం ఏర్పడితే కొత్త పోస్టులు, కార్యాలయాలు వస్తాయని ఆశించిన ప్రజలకు ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీవ్ర నిరాశ కలిగిస్తోంది. అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లిలో గత 35 సంవత్సరాలుగా పనిచేస్తున్న బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీ (BMP) వింగ్ ను పూర్తిగా ఎత్తివేస్తూ ఆ పోస్టులను తిరుపతి జిల్లాలో ఇష్టం వచ్చిన చోట వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ కావడం కలకలం రేపుతోంది.
కర్ణాటక సరిహద్దులో ఉన్న అన్నమయ్య జిల్లాలో గంజాయి, నాటుసారా, NDPL వంటి ఎక్సైజ్ నేరాలు అధికంగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టడంలో BMP వింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. అలాంటి వింగ్ ను తొలగించడం వల్ల జిల్లాలో నేరాలు పెరిగే ప్రమాదం ఉందని, జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఎలాంటి స్పెషల్ వింగ్స్ లేకపోవడం గమనార్హమని ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత ఉన్న పోస్టులు పోవడం అంటే శాఖను, జిల్లానుబలహీనపరచడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags: Shock for Annamayya district Excise Department