March 27, 2026
Explore
పాలిసెట్‌కు ఉచిత శిక్షణ: ప్రిన్సిపల్

పాలిసెట్‌కు ఉచిత శిక్షణ: ప్రిన్సిపల్

March 27, 2026 | Andhra Pradesh

మదనపల్లె టౌన్ ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్-2026 పరీక్షకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏప్రిల్ 2 నుంచి 23వరకు శిక్షణ నిర్వహించ నున్నట్లు పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు బోధించే ఈ తరగతులు విద్యార్థులకు ఉపయోగకరమని చెప్పారు. ఏప్రిల్ 25న నిర్వహించే పాలిసెట్ పరీక్షకు సిద్ధమయ్యేలా మార్గ నిర్దేశం చేస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 2 నుంచి 4 వరకు కళాశాలకు నేరుగా వచ్చి నమోదు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 9912342073 కి సంప్రదించవచ్చునని తెలిపారు.

Tags:Free Coaching for POLYCET: Principal