పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలో క్రిష్ణాష్టమి ముందస్తు సంబరాలు గురువారం నిర్వహించారు. పట్టణంలోని రాయలసీమచిల్డ్రన్స్ అకాడమి పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో క్రిష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు క్రిష్ణుడు, గోపికల వేషధారణలో సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలలో చిన్నారుల వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ సంస్కతి , సాంప్రదాయాలపై విద్యార్థులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రజిని, జలజా, రెడ్డెమ్మ, వనజ, సత్య, శివశంకర్, ముభారక్, షాహిన, రేక, రేణుక, లక్ష్మీ, అమృత పాల్గొన్నారు.
Tags: Early Krishnashtami celebrations