September 3, 2026
Explore
సర్వాంగా సుందరంగా శ్రీకృష్ణాలయం

సర్వాంగా సుందరంగా శ్రీకృష్ణాలయం

September 3, 2026 | Andhra Pradesh


-4న కృష్ణాష్టమి వేడుకలు

పుంగనూరుముచ్చట్లు:

శ్రీకృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని యాదవ సంఘం ఆధ్వర్యంలో గోకులాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు శ్రీకృష్ణాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శుక్రవారం జరగనున్న కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా కృష్ణమరెడ్డిపల్లి రోడ్డులో గల ఆలయంలో వేకువజాము నుంచి హోమాలు, పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేయనున్న్నారు. భక్తుల కోసం బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తల కోసం షామియానాలు ఏర్పాటు చేశారు. మంచినీరు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. మామిడి, అరటి తోరణాలతో ఆలయంలో భక్తిభావం ఉట్టిపడుతోంది. అలాగే ఆలయ సమీపంలో ఉట్టికొట్టేందుకు ఏర్పాట్లు చేశారు. వేలాది మంది యాదవులు, ప్రజలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పటిష్టంగా చేశారు. ఆలయ సమీపంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. యాదవులచే భజనలు, పిల్లనగ్రోవి, నృత్యాలు, గోమాతల ఊరేగింపు, పుష్పపల్లకి నిర్వహించనున్నారు. కృష్ణాష్టమి వేడుకలలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.

Tags: The Sri Krishna Temple: Beautiful in Every Aspect