వీరబల్లె ముచ్చట్లు:
వీరబల్లె పట్టణంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం చేయడం అత్యంత పుణ్యఫలమని, సాయిబాబా మార్గంలో సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆయన అన్నారు.
పూజల అనంతరం భక్తులకు స్వయంగా ప్రసాదం వడ్డించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Tags: Grand ‘Annadanam’ (food donation) at the Veeraballe Saibaba Temple.