September 3, 2026
Explore
పెద్దపాడులో పశువుల షెడ్డు నిర్మాణానికి భూమిపూజ

పెద్దపాడులో పశువుల షెడ్డు నిర్మాణానికి భూమిపూజ

September 3, 2026 | Andhra Pradesh

రైల్వే కోడూరు ముచ్చట్లు:

రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట పంచాయతీ పెద్దపాడులో పల్లె పండుగ 3.0లో భాగంగా పశువుల షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి భూమిపూజ చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, రైతులు, పశుపోషకులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల్లో ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో చైర్మన్ జయప్రకాశ్, ఎన్డీఏ కూటమి నేతలు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: Bhoomi Puja for the construction of a cattle shed in Peddapadu