September 3, 2026
Explore
ఈనెల 8న పీలేరులో జల్సా-ఎ-సీరతున్ నబీ

ఈనెల 8న పీలేరులో జల్సా-ఎ-సీరతున్ నబీ

September 3, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

పీలేరు మల్లెల గ్రౌండ్స్‌లోని అక్సా మసీదులో ఈనెల 8న జల్సా-ఎ-సీరతున్ నబీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జామియా మసీదు ముతవల్లి అల్లావుద్దీన్ తెలిపారు. గురువారం జామియా మసీదులో కార్యక్రమ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రవక్త మహమ్మద్ జీవిత విశేషాలు, బోధనలు, మత, సామాజిక, వ్యక్తిగత విలువలపై హజరత్ ముఫ్తీ అహ్మదుల్లా నిసార్ సాహెబ్ ఖాస్మి ప్రసంగిస్తారని తెలిపారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు జరిగే కార్యక్రమానికి ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అల్లావుద్దీన్ కోరారు.

Tags:Jalsa-e-Seerat-un-Nabi in Pileru on the 8th of this month.