కడప ముచ్చట్లు:
కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ పరారైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. దొంగతనం కేసులో రిమాండ్లో ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన వీరారెడ్డి కడప సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నాడు. మరో దొంగతనం కేసుకు సంబంధించి రాయచోటి పోలీసులు PT వారెంట్పై వీరారెడ్డిని రాయచోటి కోర్టులో హాజరుపరిచి తిరిగి కడప సబ్ జైలు వద్దకు వచ్చాక లోపలికి వెళ్లే క్రమంలో తప్పించుకొని పారిపోయినట్లు సమాచారం.
Tags: Prisoner escapes from Kadapa Central Jail!