September 2, 2026
Explore
మహా జననేత రాజన్నకు ఘన నివాళులు

మహా జననేత రాజన్నకు ఘన నివాళులు

September 2, 2026 | Uncategorized

పుంగనూరుముచ్చట్లు:

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయనకు ఘన నివాళులర్పించారు. రాజన్న విగ్రహానికి మాజీ ఎంపీ రెడ్డెప్ప , మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము , జిల్లా పార్టీ యూత్‌వింగ్‌ కన్వీనర్‌ కొత్తపల్లె చెంగారెడ్డి తో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మండలంలోని సుగాలిమిట్టలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌విగ్రహానికి మండల పార్టీ అధ్యక్షుడు అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌ జిందాబాద్‌…జోహర్‌ రాజన్న, వైఎస్సార్‌సిపి జిందాబాద్‌ అంటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ రాజన్న ఆశయాలను కాపాడుతామని , వైఎస్సార్‌సిపి పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిందని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్కరు ఉధ్యమించాలని పిలుపునిచ్చారు. ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై నిరంతరం పోరాటం చేసేందుకు పార్టీ క్యాడర్‌ సైనికులవలే పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్లు ఆవుల అమరేంద్ర,లలిత,మాజీ ఎంపిపి నరసింహులు, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి జయరామిరెడ్డి, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు సిద్ధిక్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్‌, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, కొండవీటి నరేష్‌, రాజేష్‌, రమణ, ఖాదర్‌, ఖాదర్‌బాషా, ప్రశాంత్‌రెడ్డి, అస్లాంమురాధి, నయాజ్‌, జావిద్‌, శ్రీరాములునాయక్‌, రామయ్యనాయక్‌, వాసునాయక్‌, మనోజ్‌, రాజునాయక్‌, శీననాయక్‌, ద్వారస్వామినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Grand tributes to the great mass leader Rajanna.